calender_icon.png 5 November, 2024 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరసిస్తోన్న పంచాయతీలు

19-07-2024 04:05:00 AM

  1. నిధులు లేక గ్రామాలు ఆగమాగం
  2. కష్టంగా మారిన వాహనాల నిర్వహణ
  3. పనికి ముందుకు రాని కార్మికులు
  4. అప్పులు చేసి నెట్టుకొస్తున్న అధికారులు
  5. పెండింగ్‌లో కేంద్ర, రాష్ట్ర నిధులు 3 వేల కోట్ల పైనే

హైదరాబాద్, జూలై 1౮ (విజయక్రాంతి): దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లోని పంచాయతీలు నిధులు లేక నీరసించి పోతున్నా యి. రాష్ట్రవ్యాప్తప్తంగా 12,768 గ్రామ పం చాయతీలు ఉండగా వాటి నిర్వహణకు ఎంత లేదన్నా ప్రతి నెలా రూ.60 వేల నుంచి 1.50 లక్షల వ్యయం అవుతుంది. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లా గుమ్మడి మండలంలోని రాంరెడ్డి బావి పంచాయతీని నిర్వహించాలంటే ప్రతి నెలా రూ.55 వేలు అవుతుంది. ఈ గ్రామంలోని జనాభా 500కు పైగా ఉంది.

ప్రతినెలా స్టేట్‌ఫైనాన్స్ కమిషన్ (ఎస్‌ఎఫ్‌సీ) నిధులు రూ.26,040, కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.41,335 రావాల్సి ఉంది. అయితే ఎస్‌ఎఫ్‌సీ నుంచి 20 నెలలు , కేంద్రం నుంచి 6 నెలలుగా నిధులు రాకపోవడంతో ఈ గ్రామంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి వేతనాలు రావడంలేదు. ఈ సమస్య రాష్ర్టవ్యాప్తంగా 12,768 పంచాయతీలు ఎదుర్కొంటున్నాయి. 6 నెలలుగా కేంద్రం నిధులు రావడం లేదు. ఎసిఎఫ్‌సీ నిధులు రెండేళ్లలో అప్పుడప్పుడు ఇచ్చినప్పడికీ 20 నెలలకుపైగా రావాల్సి ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సకాలంలో నదులు విడుదలయితేనే చిన్న పంచాయతీల నిర్వహణ భారంగా ఉంటుంది.

అలాం టిది నెలల తరబడి నిధులు పెండింగ్‌లో ఉండంతో రాష్ర్టంలోని గ్రామ పంచాయతిలన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. పలు రకాల పన్నుల రాబడి ఉన్న మేజర్ పంచాయతీల పరిస్థితి కొంత మెరుగ్గా  ఉన్నా ఏమాత్రం ఆదాయం లేని 5,500 పైగా చిన్న పంచాయతీల్లో చిల్లి గవ్వలేక సంక్షోభంలో ఉన్నాయి. గత ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటివరకు సుమారు రెండేళ్ళు ఎస్‌ఎఫ్‌సీ నిధులు సక్రమంగా రాకపోవడంతో పంచాయతీల్లో అన్ని కార్యక్రమాలు ఇబ్బందిగా మారింది.

2011 జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలోని పంచాయతీలకు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం ప్రతినెలా సుమారు రూ.180 కోట్లు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఎస్‌ఎఫ్‌సీ కింద రూ.120 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రంలోని పంచాయతీలకు కేంద్రం రూ.1,080 కోట్లు (గడిచిన 6 నెలలకు, నెలకు రూ.180 కోట్లు చొప్పున) ఉండగా ఎస్‌ఎఫ్‌సీ నిధులకు సంబంధించి  రూ.2,400 (20 నెలలకు నెలకు  రూ.120 కోట్లు చొప్పున) కోట్లు రావల్సి ఉందని అంచనా. పెండింగ్‌లో ఉన్న ఈ నిధులు విడుదలయితే గ్రామ పంచాయతీల్లో అభివృద్ది పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.

కష్టంగా వాహనాల నిర్వహణ 

పంచాయతీల్లో నిర్వహించే ట్రాక్టర్లు, చెత్తబండ్లకు అనుకోకుండా ఏవైనా మరమ్మతు లు చేయాల్సి వచ్చినా, డీజిల్ కొనుగోలు సంబంధిత పనులు కోసం ఖర్చు పెట్టాల్సి రావడంతో నిర్వహణ భారంగా మారింది. దీనికి తోడు తాగునీటి కోసం ఉపయోగించే విద్యుత్ మోటార్లలో సమస్యలు వస్తే రిపేర్లు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత వర్షకాలంలో గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి ఉంది. వాటి ద్వారా వ్యాధులు వచ్చే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో తరచూ జరిగే సమావేశాల్లో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొనేలా చేయాలి, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి,  ఆ ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

కాని వాటికి నిధులను పంచాయతీ ఖాతాల్లో ఉన్నాయా లేదా అనేది పట్టించకోవడం లేదని ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్న సమయంలో నిధులు విడుదల కాకపోయినా ఏదో విధంగా డబ్బులు సర్దుబాటు  చేసేవారు. సర్పంచ్‌ల పదవీకాలం పూర్తికావడంతో ఈ సంవత్సరం ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక పాలన ప్రారంభమైంది. కొన్ని చోట్ల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పను లు నిలిచిపోకుండా ఉండేందుకు డబ్బులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక పనుల కోసం జీతం డబ్బులు ఖర్చు చేస్తుండటంతో కు టుంబాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నామని, కొందరు అధికారులు వాపోతున్నారు.

అప్పులు చేసి మరీ పంచాయతీలు నిర్వహించాల్సి వస్తోందని, ఉన్నతాధికారులకు భయ పడి ఈ విషయాన్ని చెప్పుకోలేక పోతున్నామంటున్నారు. ఈ నేపథ్యంలో పంచా యతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఎప్పుడు వస్తాయని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదాయ వనరులు ఉండే మేజర్ పంచాయతీలు తప్ప ఇతర చోట్ల ఆర్థిక సమస్య పట్టి పీడిస్తోంది. జనాభా ప్రాతిపదికను పంచాయతీలకు రావాల్సిన నిధులు రాకపోవడం, ఇతర ఆదాయ వనరులు లేకపోవడంతో గ్రామా ల్లో ప్రజల కనీస సమస్యలు కూడా పరిష్కరించేలని పరిస్థితి లేకుండా పోయిందని సంబంధిత అధికారులు వాపోతున్నారు.

కార్మికుల నిరాసక్తి

పంచాయతీలకు నిధుల లేమి కారణంగా అనేక  చోట్ల సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో రోజువారీ పనులు చేసేందుకు కార్మికులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. గత ప్రభుత్వం పంచాయతీల్లో 500 జనాభాకు ఒక మల్టీపర్సస్ కార్మికుడిని నియమించుకునే ఆవకాశం కల్పించింది. వీరు విద్యుత్ లైట్లు, పారిశుద్ధ్యం మురుగుకాల్వల్లో పూడిక తొలగింపు, చెత్త ట్రాక్టర్ నడిపించడం, మంచినీటి సరఫరా వంటి పనులు చేయాల్సి ఉంటుంది. అయితే అసలే చాలీచాలనీ వేతనాలతో (రూ.8,500) పనిచేస్తున్న వీరికి ప్రస్తుతం కొద్దినెలలుగా బకాయిలు ఉండటంతో చాలా పంచాయతీల్లో కార్మికులు విధులకు రావడం లేదని తెలుస్తోంది. మేజర్ పంచాయతీల్లో తగినంత మంది సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.