ప్రేమ విఫలమవడంతో కథానాయిక రాశీ ఖన్నా చాలా కృంగిపోయారట. ఆ తరువాత తనను తాను మార్చుకుని స్ట్రాంగ్‌గా నిలబడ్డారట. ఈ విషయాలను రాశీఖన్నా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించారు.
రంజ న్ చందన్ దర్శకత్వంలో ‘ది సబర్మతీ రిపోర్ట్’ రూపొందింది. శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. “వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్ పర్స న్. గతంలో నా ప్రేమ వ్యవహారం పెళ్లి వర కూ వెళ్లకుండానే బ్రేకప్ అయ్యింది.
ఆ సమయంలో నేనెంతో కుంగిపోయా. ఆ తరువా త నన్ను నేను మార్చుకుని స్ట్రాంగ్‌గా నిలబడ్డా. కెరీర్‌పై ఫోకస్ పెట్టా. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. దక్షిణాదిలో నేను ఎన్నో చిత్రాల్లో నటించా. హీరోయిన్‌గా తెలుగులో నా తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ విడుదల తర్వాత తిరుపతి వెళ్లాం. పెద్ద ఎత్తున జనాలు మమ్మల్ని చుట్టుముట్టారు. వారంతా నా కోసమే వచ్చారని మేనేజర్ చెప్పాడు. ఈ సంఘటన నేనెప్పటికీ మరిచిపోను” అని రాశీ ఖన్నా తెలిపారు.