08-03-2025 10:52:54 PM
మంథని ఆర్టీసీ డిపోలో మహిళ దినోత్సవంలో డిపో మేనేజర్ శ్రవణ్ కుమార్
మంథని,(విజయక్రాంతి): మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం పెద్ద పీట వేసిందని మంథని ఆర్టీసీ డిపోలో మహిళ దినోత్సవంలో డిపో మేనేజర్ వి. శ్రవణ్ కుమార్ అన్నారు. శనివారం మంథని డిపో మేనేజర్ ఆధ్వర్యం లో ఆర్టీసీ డిపోలో, బస్టాండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేనేజర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఆర్టీసీ బస్ లలో ప్రయాణించే ప్రయాణికులు జ్యోతి(నర్సు). జ్యోతి (టీచర్). సంధ్య(టీచర్). రాజేశ్వరి(అంగన్వాడి ) సంధ్య (అంగన్వాడి) సరిత (అంగన్వాడి) లను ఘనంగా శాలువాతో మరియు జ్ఞాపిక లతో ఘనంగా సన్మానించారు. డిపో లో ఉత్తమ ఈపీకె సాధించిన మహిళా కండక్టర్ సీహెచ్ స్వరూప, సరిత లకు శాలువా తో సన్మానించారు. అలాగే మహిళలందరికీ సాంస్కృతిక మరియు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మేనేజర్ ఏంజెల్, ముఖీమ్. ఆర్ హెచ్ సివెంకటేశ్వర్లు. ఎస్ ఐడి గోపాల్. సిస్టమ్ సూపర్వైజర్ రాజబాబు, శ్రీనివాస్ కండక్టర్ మరియు మహిళా కండక్టర్ లు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.