27-04-2025 12:10:37 AM
ఎంపీ రఘునందన్‌రావు
జిన్నారంలో శివాలయ ధ్వంసంపై డీజీపీకి ఫిర్యాదు
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో 70 వేల మంది రోహింగ్యాలు ఉన్నటు తెలుస్తోం దని, ఇక్కడున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ప్రజలను వెంటనే వెళ్లగొట్టాలని లేదంటే నగరం అగ్నిగోళంగా మండుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో శివాలయ ధ్వంసంపై శనివారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో పోలీసులు సకాలంలో స్పందించలేదని తెలిపారు. నిందితులను వదిలేసి హిందువుల మీద నాలుగు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
ఘ టనకు కారణమైన దేవాల యం పక్కన ఉన్న మదార్సాకు చెందిన పిల్లలను పో లీసులకు అప్పజెప్పార న్నా రు. దేవాలయం ధ్వంసానికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఇంకా ఎందు కు బయటకు రాలేదని ప్ర శ్నించారు. మదార్సలో ఉ న్న పిల్లలు ఈ దేశం వారేనని స్థానిక ఎస్పీ చెప్పగలరా అని ప్రశ్నించారు. రామాలయం స్థలంలో మదర్సా ఎట్లా వచ్చిందో స్థానిక కలెక్టర్ సమాధానమివ్వాలన్నారు.