calender_icon.png 27 October, 2024 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ అవుతోన్న సరిహద్దు

27-10-2024 12:28:02 AM

తాజా శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: భారత్ మధ్య కుదిరిన ఒప్పందంతో ఇరుదేశాలు సరిహద్దు నుంచి వెనక్కి వెళ్తున్నాయి. లడఖ్ సరిహద్దులోని కీలక ప్రాంతాలైన డెప్సాంగ్, డెమ్‌చాక్‌లో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలను, గుడారాలను తొలగిస్తున్నాయి. అమె రికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ శుక్రవారం శాటిలైట్ ఫొటోలను విడుదల చేసింది. ఆగస్ట్, అక్టోబర్ మొదటివారంలో తీసిన ఫొటోలను పోల్చుతూ ఒప్పందానికి కట్టుబడి ఇరుదే శాలు సరిహద్దును ఖాళీ చేస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఒప్పందానికి ముందు తీసిన ఫొటోల్లో కనిపించిన సైనిక స్థావరాలు, తాత్కాలిక నిర్మాణాలు, ఆర్మీ వాహనాలు తాజా ఫొటోలలో కనిపించడం లేదు. కాగా.. గాల్వాన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉధ్రిక్త వాతారణం నెలకొంది. దీంతో సరిహద్దు వెంబడి భారీగా సైన్యాన్ని మోహరించి, ఆయుధాలను తరలించడంతోపాటు తాత్కాలిక నిర్మాణాలను చేపట్టాయి. బ్రిక్స్ సమావేశానికి ముందు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. డెప్సాంగ్, డెమ్‌చాక్ ప్రాంతాల్లో  2020కి పూర్వపు స్థితి కొనసాగిస్తూ, పెట్రోలింగ్ ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.