రాచకొండ పరిధిలో ఆంక్షలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో సోమవారం నుంచి వచ్చేనెల 8 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సుధీర్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ (పూర్వ 144 సెక్షన్) అమలులో ఉంటుందని, ఎగ్జామ్ సెంటర్లకు 200 మీటర్ల దూరం వరకు నలుగురు, అంతకంటే ఎక్కువ వ్యుక్తులు గుంపుగా ఉండొద్దన్నారు.