calender_icon.png 24 December, 2024 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాగ్‌లెస్ డేపై విద్యాశాఖ సమీక్ష

10-07-2024 04:23:45 AM

  • మరింత మెరుగ్గా ఉండాలని పలువురి సూచన 
  • సిఫార్సులను పరిశీలించి త్వరలో కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, జూలై 9: స్కూళ్లలో బ్యాగ్‌లెస్ డే (పుస్తకాలు లేకుండా విద్యార్థులు పాఠశాలకు రావడం) అమలులో మార్గదర్శకాలపై కేంద్ర విద్యాశాఖ మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ విధానాన్ని మరింత తీర్చిది ద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారిక వర్గా లు వెల్లడించాయి. పాఠశాలల్లో బ్యాగ్‌లెస్ డేస్‌ను అమలు చేయడానికి, నేర్చుకోవడం లో విద్యార్థులు ఆనందంగా, ఒత్తిడి లేకుండా చేసేందుకు సమగ్ర మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపాయి. ఈ అంశానికి జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) అనుబంధ సంస్థ పీఎస్‌ఎస్ సీఐ వీఈ బాధ్యత వహించిందని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో అధికారుల నుంచి వివిధ సలహాలను స్వీకరించారు.

స్థానిక వాతావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, జీవజాతుల గురించి వివరించడం, నీటి స్వచ్ఛతను గుర్తించడం, స్థానికంగా ఉన్న ముఖ్యమైన భవనాల సందర్శన వంటి సూచనలు చేశారు. వీటన్నింటినీ పరిశీలించి మెరుగైన మార్గదర్శకాలను రూపొందిస్తాం అని కేంద్ర విద్యాశాఖ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం ప్రకారం 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు కనీసంగా 10 రోజులు పుస్తకాలను తీసుకురాకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని పేర్కొంది. ఈ సమయంలో స్థానిక పరిస్థితులపై అవగాహన కల్పించడం, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని చట్టంలో పొందుపరిచారు.