calender_icon.png 7 March, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఈవో ఆకస్మిక తనిఖీ

07-03-2025 12:24:30 AM

మునగాల, మార్చి 6: సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో పరు పాఠశాలలని గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు, మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల నందుఉదయం స్టడీ అవర్ సమయంలో అస్మిక తనిఖీ నిర్వహించిన డీఈవో అశోక్ కుమార్ విద్యార్థులతో మాట్లాడారు. 

అదేవిధంగా ప్రార్థన సమయంలో పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే  బాగా చదవాలని అభివృద్ధి చెందాలని సూచించారు. మునగాల ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతిచదువుతున్న బ్లెస్సీ అను విద్యార్థినిని 2025 సంవత్సరంలో ఇన్స్పుర్ బహుమతి పొందినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ,కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ ప్రత్యేక అధికారి సునీతరాణి,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.