calender_icon.png 4 December, 2024 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఈఓ ఆకస్మిక తనిఖీ

03-12-2024 11:09:09 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని తలమల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా డీఈవో యాదయ్య మాట్లాడుతూ.. పాఠశాల పిల్లలచే తెలుగు, ఇంగ్లీష్, చదివించటం జరిగింది. ఇంగ్లీష్ చదవడంలో వెనుకబడి ఉండటాన్ని గుర్తించి, పిల్లలు ఇంగ్లీష్ భాషపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ శాతం తగ్గించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన  పాటించాలని, పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.