calender_icon.png 26 December, 2024 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఇఓ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు

04-12-2024 05:13:47 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండలంలో జిల్లా విద్యాధికారి ఎలంకి  శ్రీనివాస్ రెడ్డి పలు గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన మెనూ తప్పకుండా పాటించాలని నాణ్యత లోపాలు ఉండకూడదు అని కార్మికులకు, ఉపాధ్యాయులకు తెలిపారు. మండలంలోని జగదేవపూర్, బచ్చలగూడ, దౌలాపూర్, కొండాపూర్, బిజి వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం.మాధవ రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి.సైదులు తదితరులు పాల్గొన్నారు.