నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన టీచర్స్ సెల్ ఫోన్స్ వాడుతూ కాలక్షేపం చేయడంపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. శనివారం నాగర్ కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనకి చేశారు. ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు తరగతి గదిలోనే సెల్ఫోన్ వాడుతూ కాలక్షేపం చేయడాన్ని వారే స్వయంగాగుర్తించారు.
వెంటనే ఆగ్రహించిన డీఈవో ఇద్దరి ఉపాధ్యాయుల రెండు సెల్ ఫోన్ లను సీజ్ చేశారు. విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందన్న కనీస బాధ్యత కూడా లేకుండా ఉపాధ్యాయులు సెల్ఫోన్ వాడుతూ కాలక్షేపం చేయడం ఏంటని మండిపడ్డారు.
జిల్లా వ్యాప్తంగా ఇక నుండి ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలో సెల్ఫోన్ వాడేందుకు వీలులేదని తరగతి గదిలోకి వెళ్లే ముందు ప్రధాన ఉపా ధ్యాయుడు వద్ద సెల్ఫోన్ భద్రపర చుకొని వెళ్లాలని ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం ఆయా తరగతి గదిలోని విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎంఈఓ భాస్కర్ రెడ్డి ఉన్నారు.