calender_icon.png 2 April, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డీఈవో

21-03-2025 01:00:24 AM

రాజేంద్రనగర్, మార్చి 20 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజేంద్రనగర్ మండల పరిధిలోని శివరాంపల్లి పాఠశాలలో ఎస్‌ఎస్సి పరీక్షల ఏర్పాట్లను రంగా రెడ్డి డిఈఓ సుశీంద్ర రావు పరిశీలించారు.

పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంఈఓ శంకర్ రాథోడ్‌కు సూచించారు.  మంచినీటి సౌకర్యం, ప్రతి రూములో ఫ్యాన్ లు, తగిన ఫర్నిచర్, లైట్స్ లు ఏర్పాట్లు చేయాలని కోరారు.

పరీక్షలకు సీటింగ్ ఆరెంజ్ మెంట్స్ పరిశీలించారు. హెచ్ ఎం కిషన్ నాయక్,రాజేంద్రనగర్ జోనల్ సెక్రటరీ గాంగ్య నాయక్, సుదర్శన్, జంగయ్య, నర్సింహా చారి,వెంకటయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు