నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని వెంగవాపేట్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం తొమ్మిది గంటలకి పాఠశాల చేరుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ప్రార్థన సమయంలో టీచర్ తో కలిసి ప్రార్థన చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు విద్యాబోధన మధ్యాహ్న భోజన పథకం స్టడీ అవర్స్ తదితర అంశాలపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజ్జరం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.