23-03-2025 12:00:00 AM
తనిఖీలు నిర్వహించిన- జిల్లా విద్యాధికారి సుసింధర్ రావు
ఆమనగల్, మార్చి 22 (విజయ క్రాంతి): పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఆమనగల్, మాడుగుల, ఇర్విన్‌లో జిల్లా పరిషత్ బాలుర, బాలికల పదవ తరగతి పరీక్షల కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎవరైనా మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన, ప్రోత్సహించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి సుసింధర్ రావు హెచ్చరించారు.
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన ఏర్పాట్లను అడిగి తెలుసుకుని... అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పది పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.