calender_icon.png 10 March, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఈవో ఆకస్మికంగా తనిఖీ

05-03-2025 07:45:14 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని జండా వెంకటాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈవో యాదయ్య మాట్లాడుతూ.... పదవ  తరగతి విద్యార్థులను పిలిచి ఇంగ్లీషు సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నలు వేసి బోర్డుపైన ఆన్సర్ రాపియ్యడంతో డిఈవో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రేపటి నుంచి జరిగే పదవ తరగతి ప్రీ ఫైనల్, ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరగా పడుతున్నాయని బాగా కష్టపడి మంచి మార్కులు సంపాదించి మీకు, మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు, మీ ఊరికి మంచిపేరు తీసుకురావాలని అన్నారు.

అనంతరం పదవ తరగతి విద్యార్థులకు పది నిమిషముల పాటు మోటివేషన్ క్లాస్ చెప్పి మధ్యాహ్న భోజనమును  పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులు యశోదరకి పదవ తరగతి బోధించే ఉపాధ్యాయులకు కొన్ని సూచనలను అందించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులు డీఈవో అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పిన విద్యార్థులు ఇద్దరిని రోల్ నెంబర్ 5, వైష్ణవి, రూల్ నెంబర్ 12, అజిత్ లను పిలిపించి డీఈవో సన్మానించారు. విద్యార్థులు ఇంకా బాగా చదివి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోదర ని, 10వ తరగతికి ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుడు స్లీవయ్య ని డీఈవో అభినందించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించి, అన్ని వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు స్లీవయ్య, జ్యోతిర్మయి, వాణిశ్రీ, దుర్గ ప్రసాద్, రమేష్, సతీష్, రెహనా బేగం, రవీందర్, వ్యాయామ ఉపాధ్యాయులు బెల్లం శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.