calender_icon.png 4 February, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనసంద్రమైన కొండపోచమ్మ

04-02-2025 12:00:00 AM

  1. బోనం ఎత్తిన శివసత్తులు
  2. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 

జగదేవపూర్. ఫిబ్రవరి 3: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే   కొండపోచమ్మ  జాతర 2 వ వారం సోమవారం జనసంద్రంగా మారింది .  కోరిన కోర్కెలు తీర్చే  కొంగు బంగారంగా కొమురవెల్లి మల్లన్న చెల్లెలు గా ప్రఖ్యాతి  గాంచిన కొండపోచమ్మ  జాతర ఉత్సవాలు ఘనంగా శివ సత్తులు నెత్తిన బోనం ఎత్తి  ఇరోగాల ఆటలతో సోమవారం అమ్మవారికి మొక్కులు చేలించుకొని నైవేద్యం సమర్పించారు.

ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు అందంగా అలంకరించారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు  అనుమతి ఇవ్వడంతో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో రవికుమార్ మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం  కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనం అనంతరం భక్తులు కొండపోచమ్మ ను దర్శించుకునే ఆనవాయితీ అనాదిగా వస్తుందన్నారు.

రాష్ర్ట నలుమూలల తో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని ఈవో రవికుమార్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఎస్‌ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.