calender_icon.png 18 November, 2024 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెన్మార్క్ భామదే అందాల కిరీటం

18-11-2024 02:12:03 AM

73వ విశ్వసుందరిగా ఎన్నిక

మెక్సికో వేదికగా పోటీలు.. 

ప్చ్.. భారత్‌కు తప్పని నిరాశ

న్యూఢిల్లీ: మెక్సికో వేదికగా జరిగిన అందాల పోటీల్లో డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీల్లో మొత్తం 125 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడగా.. 21 ఏండ్ల విక్టోరియాకే కిరీటం దక్కింది. నైజీరియా చిన్నది చిడిమ్మ, మెక్సికో భామ ఫెర్నాండా మొదటి రెండో రన్నరప్‌లుగా నిలిచారు. ౭౩వ మిస్ యూనివర్స్‌గా నిలిచిన విక్టోరియాకు గతేడాది విశ్వసుందరి పలాసియోస్ కిరీటం తొడిగారు. 

డెన్మార్క్ నుంచి తొలి చిన్నది

మెక్సికోలో జరిగిన విశ్వసుందరి పోటీలకు భారత్ నుంచి వెళ్లిన రియా సింఘా కనీసం టాప్ కూడా చేరుకోలేకపోయింది. ఇక విశ్వసుందరి కిరీటాన్ని అందుకోవడం డెన్మార్క్‌కు ఇదే మొదటిసారి. విక్టోరియా విషయా నికి వస్తే 2004లో జన్మించిన విక్టీరియా డిగ్రీ పట్టా అందుకుంది. తదనంతరం వ్యాపారవేత్తగా రాణిస్తూనే మోడలింగ్ వైపు అడుగులేసి ంది. మిస్ డెన్మార్క్‌గా నిలిచిన ఈ భామ.. ౨౦౨౨లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ నిలిచింది.