calender_icon.png 29 October, 2024 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనపు సర్వేకు అనుమతి నిరాకరణ

28-10-2024 12:00:00 AM

జ్ఞానవాపి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశాలు

వారణాసి, అక్టోబర్ 27: జ్ఞానవాపి కేసులో వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది. జ్ఞానవాపిలోని ప్రధాన గోపురం కింద తవ్వ కాలు చేపట్టడంతోపాటు భారత పురావస్త్తు శాఖతో అదనపు సర్వే చేయించే ందుకు ఆదేశాలు ఇవ్వాలని హిందూప క్షం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి తోసిపుచ్చింది. సర్వే కోరిన ప్రదేశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలులో ఉన్నాయని పేర్కొంది.

ఈ సమయంలో అదనపు సర్వేపై ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీనిపై హిందూ పక్షం తరఫు న్యాయవాది విజయ్‌శంకర్ రస్తోగి మట్లాడు తూ.. తీర్పు నిబంధనలకు, వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు. కోర్టు ఆదేశాలు నిరుత్సాహ పరిచినట్లు చెప్పారు. ఈ ఆదేశాలను పై న్యాయస్థానంలో సవాలు చేస్తామన్నారు.