calender_icon.png 25 October, 2024 | 7:58 AM

రాపిడ్‌ పరీక్షల ద్వారా డెంగ్యూని నిర్ధారించకూడదు

29-08-2024 05:16:56 PM

ఖమ్మం, (విజయక్రాంతి): జిల్లాలో అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రిలలో గల ల్యాబ్‌ లలో రాపిడ్‌ పరీక్షల ద్వారా డెంగ్యూని నిర్ధారించకూడదని వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వి.సుబ్బారావు సూచించారు. అట్టి శాంపిల్‌ ని జిల్లా ఆసుపత్రిలో గల ఐడిఎస్‌పి ల్యాబ్‌ కి పంపి ఎలీషా పరీక్ష ద్వారా నిర్ధారణ చేసిన తరువాత తగిన చికిత్సలు అందించాలని డాక్టర్‌ వి.సుబ్బారావు ఆదేశించారు. ఇది వరకే అన్ని ఆసుపతులకు సర్కులర్‌ పంపామని, కొన్ని ఆసుపత్రులు మాతమే సాంపిల్స్‌ ను ఐ.డి.ఎస్‌.పి.కీ పంపి నిర్ధారణ చేసుకొంటున్నాయి. కొన్ని ఆసుపత్రులు ఇష్టమొచ్చినట్లు డెంగ్యూ నిర్ధారణ చేసి రోగులను భయబ్రాంతులకు గురి చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసున్నారని తెలిపారు. అన్ని ఆస్పత్రులు తప్పనిసరిగా శాంపిల్‌ పంపి నిర్ధారణ చేసుకోవాలని లేని ఎడల అట్టి ఆసుపత్రిలపై చట్ట పరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు.