calender_icon.png 16 January, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభణ

31-08-2024 02:57:45 PM

రోగులతో కిటకిట లాడుతున్న ఆసుపత్రులు

వైద్య,సిబ్బంది అందుబాటులో ఉండాలి

జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల, (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో డెంగ్యూ విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయని వైద్య,సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యచికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలోని రాయికల్ మండలం ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగిత్యాల జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఓపిని చెక్ చేసి హాజరు పట్టిక పరిశీలించారు.

మౌళిక సదుపాయాలు కల్పిం చాలని సూచించారు. డెంగ్యూతో అడ్మిట్ అయిన పేషేంట్లను అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది పనితీరు రోగులను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ లో మందులు నిల్వలు పరిశీలించి ఎక్కువగాజ్వరాలు ప్రబలుతున్నందున వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి  మెరుగైన వైద్యoఅందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు.ఈకార్యక్రమంలో డీఆర్డీఓ రఘువరన్, ఆర్ఎంఓ రామకృష్ణ, డాక్టర్ శశికాంత్, తహసిల్దార్,ఎంపిడిఓ,ఎంపిఓ, తదితరులు పాల్గొన్నారు.