calender_icon.png 26 November, 2024 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో 5,372 డెంగ్యూ కేసులు

27-08-2024 02:18:10 AM

కొనసాగుతున్న ఫీవర్ సర్వే

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారం భం నుంచి ఈ నెల25 నాటికి మొత్తం 81,932 శాంపిల్స్ తీయగా 5372 డెంగీ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 1,852, సూర్యాపేటలో 471, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 426 కేసులు నమోదయ్యా యని వివరించారు. రాష్ట్రంలో ఇంటిం టి ఫీవర్ సర్వే కొనసాగుతోందన్నారు. గత నెల 23న ప్రారంభమైన ఈ సర్వే లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,78,723 ఇండ్లలో సర్వే చేశారన్నారు. 4,40,06,799 మందికి పరీక్ష లు నిర్వహించగా 2,65,324 మందికి జ్వరం సోకినట్లుగా గుర్తించి వారికి మందులు అందచేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు 152 చికున్ గున్యా, 191 మలేరియా కేసులు మాత్రమే నమోదయి నట్లు  పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 టీహబ్ ల్యాబ్స్ వైద్య పరీక్షలు అందిస్తున్నాయని తెలిపారు. తగినన్ని మందులు, అంబులెన్సులు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయని డీహెచ్ వెల్లడించారు.