హారర్ థ్రిల్లర్ ‘డీమాంటీ కాలనీ 2’ శుక్రవారం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంక ర్ జంటగా నటించారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించారు. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, అజయ్ భూపతి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఆర్జీవీ మాట్లాడుతూ.. “నేను ఇరవైఏళ్ల క్రితం ‘భూత్’ అ నే సినిమాను చేశాను. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అపార్ట్ మెంట్స్లోకి వెళ్లేందుకు కొంతకాలం భయపడి చాలామంది వెళ్లలేదు. డీమాంటీ కాలనీ రిలీజ్ అయ్యాక ఆ కాలనీ పేరు పెట్టినందుకు కాంట్రవర్సీ జరిగిందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నా తో చెప్పారు. నిర్మాత సురేశ్‌రెడ్డి మంచి మూ వీస్ తీసుకుంటాడనే నమ్మకం ఉంది’ అన్నా రు.
ఈ చిత్ర దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. ‘డీమాంటీ కాలనీ 2’ మూవీకి 3, 4 పారట్స్ కూడా చేయబోతు న్నాం. ఇప్పటిదాకా ఏ హారర్ సినిమాలో బు ద్ధిజం స్పిరిచువాలిటీ చూపించలేదు. మేము ఈ మూవీలో టిబెటియన్ యాక్టర్‌ను పెట్టి ఆ ప్రయత్నం చేశాం. అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మిగతా అతిథులు, చిత్రబృందం మాట్లాడి తమ అభిప్రాయాలను వెల్లడించారు.