calender_icon.png 19 October, 2024 | 2:09 PM

ఆగస్టు రెండో వారంలో డిమాంటీ కాలనీ2

26-07-2024 12:05:00 AM

‘డిమాంటీ కాలనీ’ (2015) చిత్రం ద్వారా దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్న అజయ్ ఆర్ జ్ఞానముత్తు సీక్వెల్‌తో మరోమారు ప్రేక్షకులను భయపెట్టనున్నారు. అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా ఆయన తెరకెక్కించిన ‘డీమాంటీ కాలనీ2’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా బుధవారం రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఓ ఇంటి నుంచి బయటకు వచ్చిన గొలుసు తిరిగి ఆ ఇంటికే చేరుతుంది.

ఈ క్రమంలో జరుగుతున్న అనూహ్యమైన ఘటనలను తెలుసుకునే ప్రయత్నంలో ఆ ఇంటికి వెళ్లిన వారంతా చనిపోతుంటారు. ఆ ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏమిటి..? దాని నుంచి ఎవరైనా బయటపడ్డారా..? వంటి థ్రిల్లింగ్ అంశాలతో రానున్న ఈ సినిమాని రాజ్ వర్మ ఎంటర్ టైన్‌మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. సామ్ సీ.ఎస్ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.