25-04-2025 08:47:41 PM
కార్పోరేట్, పాలక శక్తుల దాడులను తిప్పికొడదాం...
ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఆధ్వర్యంలో భద్రాచలంలో ప్రదర్శన, సదస్సు..
భద్రాచలం (విజయక్రాంతి): అఖిలభారత ట్రైబల్ ఫోరం ఆధ్వర్యంలో అభ్యుదయ గిరిజన సంఘం భవన్ లో శుక్రవారం జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మోకాళ్ళ రమేష్ అధ్యక్షత వహించారు. ఏఐటిఎఫ్ జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం ప్రధాన వక్తగా మాట్లాడుతూ... రాజ్యాంగంలో-చట్టాలలో గిరిజనులకు ఉన్న హక్కుల అమలు కోసం మరిన్ని హక్కులు, సౌకర్యాలను సాధించుటకు ట్రైబల్స్ అందరినీ ఐక్యం చేసి వాటి అమలు చేయించుటకు ఏఐటిఎఫ్ కృషి చేస్తుందని తెలిపారు. గిరిజన సమూహల మధ్య ఉన్న తేడాలు లేదా విభేదాలను మిత్ర వైరుధ్యంగానే భావిస్తున్నాం. హిందుత్వ వాదులు, కార్పొరేట్ కంపెనీ యజమానులతో కుమ్మకు అయ్యి అడవిలోని ఖనిజాలంతో పాటు ఇతర సంపదలను దోచుకుపోతున్నారు.
ఎదురు తిరిగితే "కగార్"పేరుతో ఆడ, మగ తేడా లేకుండా పోచపోతలకు దిగుతున్నారు. ఈ దుర్మార్గాలను నిలవరించాలి అంటే ట్రైబల్స్ అందరూ ఐక్యమై గిరిజన ఉద్యమాలను నిర్మించాలని అందకు ఏఐటిఎఫ్ బాధ్యతే తీసుకుంటుందని సత్యం తెలిపారు. రాష్ట్ర కన్వీనర్ సుర్ణపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ 2022 అటవీ సంరక్షణ నియమాలను రద్దు చేయాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు చేసిన చట్టాలను రద్దు పరచి-కార్పొరేటర్లకు దోచిపెట్టడమే బిజెపి కర్తవ్యం గా ఎంచుకున్నదని 2022 నియమాలను రద్దు చేయకపోతే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముర్ర వీరభద్రం మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని తెగలను ఓట్ల కోసం ఎస్టి జాబితాలో చేర్చారని వారిని ఈ జాబితాల నుండి తొలగించాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు జి.సక్రు, గిరిజన ఉపాధ్యాయుడు వేట్ల శాంతన్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు మోకాళ్ళ మురళీకృష్ణ, ఈసం కృష్ణ, జిల్లా నాయకులు బుద్రా తదితరులు పాల్గొన్నారు. ముందుగా భద్రాచలం గోదావరి బ్రిడ్జ్ అయ్యప్ప టెంపుల్, బస్టాండు, అంబేద్కర్ సెంటర్ మీదుగా గిరిజన సంఘం భవనం వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు చింత ఉదయ్ చింత రజిత జిల్లా నాయకులు కుంజ భూద్ర, సున్నం భూలక్ష్మి, పెంటన్న ఈసం కృష్ణ, చంద్రకళ, కొట్టెం రాధ, సురేష్ నాయకత్వం వహించారు.