calender_icon.png 24 January, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూత్ కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రదర్శన

23-01-2025 07:05:25 PM

భద్రాచలం (విజయక్రాంతి): బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడికి నిరసనగా భద్రాచలం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భద్రాచలంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి దళిత యువజన నాయకుడుపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. బాధితులకు అండగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర అటవీ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డిసిసి అధ్యక్షులు వీరయ్య మహేష్ కుమార్ గౌడ్ కి ఫోన్లో సమాచారం ఇచ్చి దాడికి పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని కోరడం జరిగింది. దాడి జరిగిన విషయంపై పూర్తి సమాచారం తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీనీ వెంటనే నిలబెట్టుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు.