- ఫుట్పాత్ లపై 160 షెడ్లు ఆక్రమణలు తొలగింపు
- ప్రజలు సహకరించాలి: డీసీ రవికుమార్
రాజేంద్రనగర్ ఫిబ్రవరి 1: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని దుర్గా నగర్ చౌరస్తాలో ఫుట్ పాత్ లపై వెలసిన సుమారు 160 షెడ్లను జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం తొలగించారు. దుర్గా నగర్ చౌరస్తాలోని ఫుట్పాత్లపై కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించుకొని షెడ్లు వేయడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారుల దృష్టికి వచ్చింది.
ఈ నేపథ్యంలో స్పందిం చిన డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదే శాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసిపి శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది షెడ్లని తొలగించారు. దుర్గానగర్ జంక్షన్ నుంచి బండ్లగూడ లిమిట్స్ వరకు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించినట్లు డిప్యూటీ కమిషనర్ వివరించారు.
అందరూ దుకాణదారులు ఫుట్పాత్లపై వెలసిన నిర్మాణాల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని బీసీ రవికుమార్ పేర్కొన్నారు. ఫుట్ పాట్లు కేవలం పాదాచార్యులకు మాత్రమే కేటాయించిన అనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. అందరూ జిహెచ్‌ఎంసి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.