calender_icon.png 29 September, 2024 | 6:51 AM

పునరావాసం తర్వాతనే కూల్చివేతలు

29-09-2024 12:40:48 AM

  1. మూసీ నిర్వాసితులు ఆందోళన చెందొద్దు
  2. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆర్థిక భరోసా కల్పిస్తాం
  3. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): స్థానికుల సహకారంతో శాంతియుతంగా మూసీ నిర్వాసితులను డబుల్‌బెడ్రూంలకు తరలిస్తామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం హిమాయత్‌నగర్ మం డలంలోని వినాయకవీధి, శంకర్‌నగర్‌ను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలసి కలెక్టర్ అనుదీప్ సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మూసీ పరీవాహక ప్రాంతాలైన వినాయక వీధి, శంకర్‌నగర్ నుంచి 151 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించామని తెలిపారు. వారిని మలక్‌పేట నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని పిల్లి గుడిసెలు, జియా గూడ మండలంలోని రెండు పడకల గృహాలకు తరలిస్తామని చెప్పారు.

రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హౌజింగ్ శాఖలు ఈ రోజు వినాయకవీధి(రసూల్‌పుర)లోని 100 కుటుంబాలను పిల్లిగుడిసెల ప్రాంతంలోని డబుల్‌బెడ్రూంలకు తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వాసితులకు డబుల్ బెడ్రూంలను లాటరీ ద్వారా కేటాయించి, ఇంటి పట్టా, తాళాలను అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు.

నిర్వాసితుల జీవనోపాధి, వారి పిల్లల చదువులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమీపంలోని ఎస్సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ గురు కులాల్లో ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. స్వ యం సహాయక సంఘాలతో మూసీ బాధితులకు రుణాలు అందిస్తామన్నారు.

నిర్వాసి తులు అపోహలకు పోవొద్దని, దుష్ప్రచాలను నమొద్దని సూచించారు. బస్తీవా సులు స్వచ్ఛందంగా డబుల్ బెడ్‌రూంలకు వెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.మహిపాల్‌రెడ్డి, ఎమ్మార్వో సంధ్యారాణి, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హౌజింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

నిర్వాసితుల తరలింపు షురూ..

మలక్‌పేట, సెప్టెంబర్ 28: మలక్‌పేట నియోజకవర్గంలోని మూసానగర్, కమల్‌నగర్, వినాయకవీధి, రసూల్‌పురా, శంకర్ న గర్ తదితర మూసీ పరీవాహక ప్రాంతా ల్లో రెవెన్యూ మార్కింగ్ చేసిన ఇళ్లల్లో నివాసముంటున్న వారందరినీ మరోచోటకు తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా బాధితులకు మొదట పునరావాసం కల్పించేం దు కు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు.

శంకర్‌నగర్, వినాయకవీధి, మూసానగర్ ప్రాంతాల్లో మూసీ ప్రాజెక్ట్‌లో ఇళ్లు కోల్పోతున్న వారికి సమీపంలోని చంచల్‌గూడ జైలు ఎదురుగా ఉన్న డబుల్‌బెడ్ రూంలో ఇళ్లను కేటాయిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. నగర శివారు ప్రాంతాల్లో కాకుండా సమీప ప్రాంతాల్లో 2బీహెచ్‌కే కేటాయించాలని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇళ్లు కోల్పోతున్న వారికి స్థానికంగానే డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తుండటంతో నిర్వాసితులు స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. 

పునరావసం తర్వాతనే కూల్చివేతలు..

మూసానగర్, వినాయకవీధి, రసూల్‌పురా ప్రాంతాల్లో శనివారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు వారు భరోసా కల్పించారు. ఇళ్ల కూల్చివేత వెంటనే ఉండదని, మొదట పునరావాసం కల్పించిన తర్వాతనే మిగతా పనులు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్వాసితులు రెవెన్యూ అధికారులు, సిబ్బందికి సహకరిచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే.. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను అందజేశారు.

పిల్లిగుడిసెల్లో 142 డబుల్‌బెడ్రూంలు..

మూసానగర్, వినాయకవీధి, రసూల్‌పురా ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు చంచల్‌గూడ జైలు ఎదురుగా ఉన్న డబుల్‌బెడ్రూం ఇళ్లను కేటాయిస్తున్నారు. దాదాపు 150 ఇళ్లకు మార్కింగ్ చేయగా అందులో వంద కుటుంబాలకు పునరావసం కల్పించేందుకు డబుల్ ఇళ్ల పట్టా అందజేసి.. ఇంటి తాళాలను సైతం అందజేయనున్నారు. పిల్లిగుడిసెల్లో 142 వరకు డబుల్ బెడ్రూంలు ఖాళీగా ఉన్నాయి. ఇందులోనే అధికంగా కేటాయించేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. స్థానికులు కూడా పునరావాసం ఇందులోనే కల్పించాలని పట్టుబడుతున్నారు.