calender_icon.png 26 November, 2024 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులో నిర్మించిన భారీ భవనం కూల్చివేత

26-09-2024 10:52:39 AM

సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని పెద్ద చెరువు సర్వే నంబర్ 93 కుషాయిపేట్ గ్రామంలో నిర్మించిన భారీ భవనాన్ని రెవెన్యూ అధికారులు డిటోనేటర్ల సహాయంతో కూల్చివేశారు. ఈ భవనం దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఎఫ్ టిఎల్ పరిధిలో నిర్మించినట్టుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా ప్రముఖ దినపత్రికలలో అక్రమంగా చెరువులో ఎఫ్ టి ఎల్ పరిధిలో నిర్మాణాలను అనే కథనాలకు ద్వారా వెలికి రావడం జరిగింది. ఇట్టి నిర్మాణాన్ని పటాన్చెరుకు చెందిన ఓ వ్యక్తి నిర్మించినట్టుగా సమాచారం. దీనికి స్పందించి పెద్ద చెరువులో నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు విలేకరులతో మాట్లాడుతూ... చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, కబ్జాకి గురి చేసినట్లయితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు .