హైడ్రాకు స్థానికుల కృతజ్ఞతలు
అమీన్పూర్, నవంబర్ 18: అమీన్పూర్లో రోడ్డును అక్రమించి ఓ వ్యక్తి నిర్మించిన ఇంటిని హైడ్రా అధికారులు నేలమట్టం చేశా రు. తెలిసిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి వందనపూరికాలనీ సర్వే నంబర్ 848లో రోడ్డును ఆక్రమించి ఓ వ్యక్తి ఇల్లు కట్టించాడు. దీంతో కాలనీవాసులు ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల హైడ్రా అధికారులు ఆ కట్టడాన్ని పరిశీలించి, దానిని పడగొట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే సోమవారం పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్తో కూల్చివేయించారు. దీందో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.