calender_icon.png 20 November, 2024 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో ఒరిగిన భవనం కూల్చివేత పనులు నిలిపివేత

20-11-2024 01:29:49 PM

ఓవైపునకు ఒరిగిన 5 అంతస్తుల భవనం

మాదాపూర్ సిద్దిక్ నగర్ లో నిన్న రాత్రి 8:10 నిమిషాలకు ఈ ఘటన 

నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణ కోసం పక్కకే భారీ గుంత

ఒరిగిన భవనాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధం

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): గచ్చిబౌలిలో ఒరిగిన భవనం కూల్చివేత పనులు నిలిచిపోయాయి. హైడ్రాలిక్ యంత్రం డీజీల్ పైపు లీకేజి కావడంతో అధికారులు కూల్చివేత పనులను ఆపివేసారు. ప్రస్తుతం హైడ్రాలిక్ యంత్రం డీజీల్ పైపుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కాగాాా, మాదాపూర్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం మంగళవారం ఓవైపునకు ఒరిగింది. ఈ భవనాన్ని కూల్చి వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నిన్న రాత్రి 8:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో 60 గజాల స్థలంలో ఒరిగింది. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణం కోసం పక్కకే 150 గజాల స్థలంలో పిల్లర్ పూట్టింగ్ కోసం పెద్ద గుంత తవ్వడంతో ఈ భవనం వంగినట్లు స్థానికులు చెబుతున్నారు.

కూల్చివేసేందుకు సిద్ధమైన భవనం 60 గజాల స్థలంలో ఉంది. హైడ్రా అధికారులు హైడ్రాలిక్ యంత్రంతో కూల్చి వేసేందుకు సిద్ధమైయ్యారు. కుంగిన భవనం చుట్టు పక్కల ఉన్న ఇళ్ళల్లోని నివాసితులకు ఖాళీ చేయించారు. జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్, ట్రాఫిక్, విద్యుత్, అంబులెన్స్,లా అండ్ ఆర్డర్ పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అప్రమత్తంగా ఉన్నారు.కాగా.. 5 అంతస్తుల భవనం యజమాని స్వప్న మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం భవనం నిర్మించినట్లు తెలిపారు. “50 గజాల స్థలంలో జీ ప్లస్ ఫోర్ మొత్తం ఐదు అంతస్తులు భవనం నిర్మించామని, 15 రోజుల నుంచి మా భవనం పక్కనే ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి.

మా ఊరు మిర్యాలగూడ మా ఆయన కారు డ్రైవర్, మాకు ఇద్దరు పిల్లలు. మాకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా భవనం పక్కనే ఉన్న స్థలం యజమాని గుంతలు తవ్వాడు. ఆ గుంతలు తొవ్వుతున్న క్రమంలో మా పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయి. దాని కారణంగా మా భవనం ఓవైపు ఒరిగింది. మా ఊర్లో ఉన్న భూములు అమ్ముకొని మాదాపూర్ లో ఇల్లు కట్టుకుని ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మా భవనం కూల్చేందుకు మేము ఒప్పుకున్నాం. మా భవనం ప్రతి ఫ్లోర్ లో 6 రూంలు ఉన్నాయి. మొత్తం 20 మంది ఉంటున్నారు. ఇప్పుడు మా భవనం కులుస్తే మా పరిస్థితి ఏంటి? మాకు మా పిల్లలకు ఈ భవనమే ఆధారం. మాకు న్యాయం జరగాలి. కాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన స్థలం యజమానితో నష్ట పరిహారం కట్టించాలని ఓనర్ స్వప్న డిమాండ్ చేశారు.