calender_icon.png 15 November, 2024 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మాణాలను కూల్చం

14-11-2024 01:24:43 AM

  1. నివాసాల జోలికి వెళ్లకుండానే బతుకమ్మకుంట పునరుద్ధరణ 
  2. హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): అంబర్‌పేట్ సమీపంలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించే చర్యలకు హైడ్రా శ్రీకారం చుట్టింది. బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం తన బృందంతో కలిసి కుంటను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆక్రమణల్లో నిర్మించిన నివాసాలను కూల్చివేస్తారేమోనన్న ఆందోళనతో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్థానికులతో మమేకమై వారి సమస్యలను సాను కూలంగా విన్నారు.

అనంతరం హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ బతుకమ్మ కుంట పరిసరాల్లోని నివాసాలను ఎట్టి పరిస్థితిలోనూ కూల్చిబోమని, ఆక్రమణలు మినహా ప్రస్తుతం మిగిలిన 5.15 ఎకరాల్లోనే బతుకమ్మకుంట పునరుద్ధరణ చేపడతామని స్థాని కులకు హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

తక్షణమే బతు కమ్మ కుంటలోని చెత్త, నిర్మాణ వ్యర్థాలను తొలగించి చెరువు తవ్వకం పనులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు. 1962 లెక్కల సర్వే ప్రకారం నంబర్ 563లో మొత్తం 14.06 ఎకరాలు కలిగిన బతుకమ్మ కుంట ఆక్రమణల కారణంగా 5.15  ఎకరాలు మాత్రమే మిగిలిం దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నా రు. ఈ కుంటకు బఫర్ జోన్‌తో కలిపితే మొత్తం 16.13 ఎకరాల విస్తీర్ణం ఉంటుందని సర్వే అధికారులు తేల్చినట్టుగా తెలిపారు. 

తార్నాక ఎర్రకుంట చెరువు విజిట్ 

తార్నాకలోని ఎర్రకుంట చెరువును హైడ్రా అధికారులు సందర్శించారు. ఎలాంటి వివాదాలు లేకపోవడంతో చెరువు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఎర్రకుంట చెరువును హైడ్రా అధికారులు విజిట్ చేశారు.

మొత్తం 5.9 ఎకరాలలో విస్తరించిన చెరువును సుందరీ కరించడం ద్వారా దుర్వాసన, దోమల బెడద తప్పుతుందని స్థానికులు హైడ్రా కమిషనర్‌ను కోరారు. దీంతో స్థానికుల విజ్ఞప్తిని పరిశీలించి ఎర్రకుంట చెరువు పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.

నాగారంలో రోడ్డు ఆక్రమణ తొలగింపు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని ఈస్ట్ హనుమాన్ నగర్ సర్వే నంబర్ 146లో 40 అడుగల విస్తీర్ణంలో ఉన్న రోడ్డును ఆక్ర మించి చేపట్టిన నిర్మాణాన్ని హైడ్రా అధికారులు బుధవారం కూల్చేశారు. నాగారం ప్రధాన రహదారికి కలిసే రోడ్డును నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఆక్రమించి ప్రహరీ నిర్మించినట్టు ఫిర్యాదు అందడంతో విచార ణ అనంతరం కూల్చివేతలు చేపట్టినట్టు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రహదారిని తిరిగి నిర్మించాలంటూ నాగారం మున్సిపల్ కమిషన ర్‌కు సూచించారు.