calender_icon.png 24 December, 2024 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుద్యాలలో రైస్‌మిల్లు కూల్చివేత

04-08-2024 12:06:30 AM

అధికారులను అడ్డుకున్న యజమాని

నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారంటూ ఆగ్రహం

కూల్చివేత పనులను నిలిపివేసిన అధికారులు

కొడంగల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలపై అధికారులు కొరఢా ఝులిపించారు. ఈ క్రమంలో శనివారం కొడంగల్ మండల పరిధిలోని దుద్యాల గ్రామ శివారులో ఉన్న గురు రాఘవేంద్ర రైస్ మిల్లును కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ స్థలంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణకు సంబంధించిన రైస్‌మిల్లు  నిర్మించినట్లు ఆరోపణలు రాగా.. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు.. పోలీసులు, ప్రత్యేక బలగాలను మోహరించి రైస్ మిల్లును జేసీబీలతో కూల్చివేయించే పనుల చేపడు తుండగా రైస్ మిల్లు యజమాని ముదిగిండ్ల కృష్ణ  అధికారులతో వాగ్వాదానికి దిగారు. రైస్‌మిల్లు నిర్మాణానికి అన్నిరకాల అనుమతులు ఉన్నాయాని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రైస్‌మిల్లును ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కూల్చివేత పనులను నిలిపివేసిన అధికారులు... పూర్తి పత్రాలతో కార్యాలయానికి రావాలని కోరారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.