ఎల్బీనగర్, అక్టోబర్ 13: పద్మశ్రీ అవార్డు గ్రహీత, 16 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శ నం మొగులయ్యకు ప్రభుత్వం బాగ్ హయత్‌నగర్‌లో 600 గజాల ఇంటి స్థలం కేటా యించిన విషయం తెలిసిందే. ఇటీవల మొగులయ్య తనసొంత ఖర్చుతో ఈ స్థలం చుట్టూ ఫ్రీకాస్ట్ ప్రహరీని నిర్మించుకున్నాడు. అయితే గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆ ప్రహరీని కూల్చివేశారు.
ఈ విషయమై శుక్రవారం మొగులయ్య హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నాగరాజు స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు స్వయంగా మొగులయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రహరీ నిర్మాణానికి చేయూతనివ్వడంతో పాటు నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.