calender_icon.png 3 October, 2024 | 4:46 PM

‘మూసీ’ కూల్చివేతలు షురూ

02-10-2024 02:16:35 AM

శంకర్‌నగర్, మూసానగర్, వినాయకవీధి, రసూల్‌పురాలో 130 ఇళ్లు నేలమట్టం

నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూమ్ ప్లాట్ల కేటాయింపు

మలక్‌పేట, అక్టోబర్ 1: మూసీ పరీవాహక ప్రాంతం శంకర్‌నగర్, మూసానగర్, వినాయకవీధి, రసూల్‌పురాలో రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేతలు ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు రివర్ బెడ్‌లోని ఇళ్లకు ఇదివరకే మార్కింగ్ చేయడంతో వాటిని కూలీలలతో కూల్చివేయించారు.

ఈ క్రమంలో మంగళవారం హిమాయత్‌నగర్ తహసీల్దార్ సంధ్య నేతృత్వంలో సిబ్బంది, కూలీలు..  మూసానగర్, వినాయకవీధి, శంకర్‌నగర్ ప్రాంతాలకు చేరుకున్నారు. మొదట ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను గుర్తించి వాటి తలుపులు, ఫ్రేమ్‌లు, కిటికీలు, పైకప్పు రేకులు, విద్యుత్ తీగలు తదితర వాటిని ఒకొక్కటికిగా తొలగించారు.

వాటిని నిర్వాసితులు వాహనాల్లో తరలించుకున్నారు. శంకర్‌నగర్, మూసానగర్, వినాయకవీధి నిర్వాసితులకు ఇప్పటికే చంచల్‌గూడలోని పిల్లిగుడిసెలు డబుల్‌బెడ్‌రూమ్ సముదాయంలోని ఫ్లాట్లను కేటా యించిన విషయం తెలిసిందే.

అయితే ఆయా ఫ్లాట్ల్లలో కనీసం తాగేందుకు మంచినీరు కూడా లేదని నిర్వాసితులు ఆరోపిం చారు. వెంటనే సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేయగా.. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు.