calender_icon.png 9 January, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా నిర్మించిన షెడ్డు కూల్చివేత

06-01-2025 06:37:05 PM

పటాన్ చెరు: బొల్లారం మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 81, 84 ఎన్ రిచ్ లేఅవుట్ లో ప్లాట్ నెంబర్ 2లో అక్రమంగా నిర్మించిన షెడ్డును మున్సిపల్ అధికారులు సోమవారం కూల్చివేశారు. పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమ పక్కన అక్రమంగా షెడ్డు నిర్మిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు మున్సిపల్ కమిషనర్ చర్యలు చేపట్టారు. ఆమె ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీతో షెడ్డును కూల్చివేశారు. మున్సిపల్ నుంచి అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని లేదంటే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.