calender_icon.png 5 March, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

05-03-2025 12:46:36 AM

  1. ఎకరం కబ్జా చేసిన అక్రమార్కులు 
  2. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు : తహసీల్దార్ రవీందర్ దత్  

రాజేంద్రనగర్, మార్చి 4 (విజయ క్రాంతి): ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను శంషాబాద్ రెవెన్యూ సిబ్బంది నేలమట్టం చేశారు. శంషాబాద్ తహసిల్దార్ రవీందర్ దత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గొల్లపల్లి కుర్దు గ్రామంలో సర్వేనెంబర్ 219, 220, 221 లో 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.

ఇందులో సుమారు ఎకరం పొలంలో కొందరు అక్రమార్కులు కబ్జా చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి అందులో రెండు నిర్మాణాలు కూడా చేపట్టారు. ఈ మేరకు స్థానికులు ఇటీవల తహసిల్దార్ రవీందర్ దత్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం తహసిల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది గొల్లపల్లి కుర్దు గ్రామానికి చేరుకొని ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ రవీందర్ దత్ మాట్లాడుతూ..  ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. శంషాబాద్ మండల పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.