calender_icon.png 29 November, 2024 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

29-11-2024 01:54:56 AM

మూడు ఎకరాల్లో  ఇళ్ల నిర్మాణానికి యత్నం  

రాజేంద్రనగర్, నవంబర్ 28: గండిపేట మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కూల్చివేశారు. విప్రోకు ఎదురుగా సర్వేనంబర్ 132లో సుమారు మూడెకరాలకు పైగా సర్కార్ స్థలం ఉంది. అందులో స్థానికులు రాత్రికి రాత్రే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు బేస్‌మెంట్ నిర్మిస్తున్నారు.

గోడలు నిర్మించి ఇళ్లు కట్టుకునేందుకు యత్నించగా తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణాలను నేలమట్టం చేశారు. సర్కార్ జాగాల్లో నిర్మాణా లు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. ఇక్కడ ఎకరం స్థలం విలువ సుమారు 50 కోట్లు ఉంటుం ది. ధరలు భారీగా పెరగడంతో సర్కార్ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. ఈ నేపథ్యంలోనే మూడు ఎకరాల స్థలంలో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు.