సంగారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): అమీన్‌పూర్ పెద్ద చెరువులో అక్రమంగా కట్టడంతో చెరువు పరిధిలోని జీవవైవిధ్య దెబ్బ తిన్నదని ఈ నెల 6న ‘విజయక్రాంతి’ లో ‘నిలువునా జీవవైవిధ్య విధ్వం సం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి హైడ్రా అధికారులు స్పందించారు. ఈ మేరకు వాణినగర్, హెచ్‌ఎంటీ కాలనీ సర్వే నంబర్లు 323,322, 325లోని అక్రమ నిర్మాణాలను ఆదివారం కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కూల్చివేత ప్రక్రియను హైడ్రా డీఎస్పీ శ్రీనివాస్, అమీన్‌పూర్ తహసీల్దార్ రాధ, నీటిపారుదల శాఖ డీఈ రామస్వామి, అమీన్‌పూర్ సీఐలు పర్యవేక్షించారు.