తెల్లవారుజామునే గుట్టు చప్పుడు కాకుండా కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
మంథని, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఆదివారం ఉదయం చర్యలు తీసుకున్నారు. మంథని బస్టాండ్ ఏరియా నుండి శ్రీపాద చౌకు చౌరస్తా వరకు తెల్లవారుజాము నుంచి అనేక నాటకీయ పరిణా మాల మధ్య అక్రమ కట్టడా లను మంథని మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి పర్యవేక్షణలో కూల్చివేశారు. మునిసిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్డుకి ఆక్రమించుకొని ఉన్న ఫ్లెక్సీలు, నేమ్స్ బోర్డ్, హోటల్, ఫ్రూట్ షాప్ ల ముందు నిర్మించిన పందిళ్లను సిబ్బంది తొలగించారు.
రోడ్డుకు ఇరువైపులా షాపుల ముందు పందిళ్లు వేయడంతో రోడ్లపై నడిచే వాహన దారులకు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందని, దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, గ్రహించిన మున్సిపల్ అధికారులు మార్కెట్లలో జాగ్రత్తగా ఈ అక్ర మ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తున్నారని మంత్రి పట్టణమంతా ప్రచారం కావడంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.