calender_icon.png 16 November, 2024 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణం కూల్చివేత

19-09-2024 11:32:43 AM

అనుమతి ఒక చోట.. నిర్మాణం మరో చోట...

ముందుగానే నోటీసులు అందజేత - మున్సిపల్ అధికారులు

భారీగా పోలీసుల మోహరింపు 

మంచిర్యాల విజయ క్రాంతి: మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టిన భవనాల కూల్చి వేత కార్యక్రమం మొదలుపెట్టారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తున్నట్లుగా మంచిర్యాలలో సైతం ప్రారంభమైందని చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే నస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నెంబర్ లో మొదలుపెట్టారు. అక్రమ నిర్మాణాలను పోలీసుల సహాయంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. 

అనుమతి ఒకచోట... నిర్మాణం మరోచోట...

టిఆర్ఎస్ నాయకుడు ఢీకొండా అన్నయ్య 40 సర్వే నెంబర్లు ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నాడు కానీ ప్రభుత్వ భూమి అయినా 42 సర్వే నెంబర్ లో జి ప్లస్ త్రీ భాను నిర్మించాడు. ఈ విషయమై ఏడాది నుండే ఇంటికి నోటీసులు అందజేశారు. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. మెల్లమెల్లగా నిర్మాణం జరుపుతుండడంతో మున్సిపల్ అధికారులు మరోసారి నోటీసులు అందజేసి గురువారం ఉదయం పూడ్చివేత చర్యలకు పూనుకున్నారు.

ముందుగానే నోటీసులు...

42 సర్వే నెంబర్లు అక్రమంగా నిర్మాణాలు చేసిన ఇంటి యజమానులకు మున్సిపల్ అధికారులు ముందుగానే నోటీసులు అందజేశారు. ప్రణాళికతో ఇంటి యజమానిని గురువారం ఉదయం ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బంధువులు ఇంటి వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. కూల్చివేత దగ్గర పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు.