calender_icon.png 17 April, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోకాపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

08-04-2025 11:42:14 AM

హైదరాబాద్: కోకాపేటలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు(Revenue Officers) కొరడా ఝులిపించారు. కోకాపేట్(Kokapet) సర్వే నంబర్ 100లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారులు గట్టి భద్రత మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు సమాచారం అందడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆక్రమణకు గురైన భూమిలో వ్యాపార సముదాయాల నిర్మాణం జరుగుతోంది. స్థానిక పౌరుల ఫిర్యాదుల మేరకు, గండిపేట రెవెన్యూ అధికారులు(Gandipet Revenue Officers) పోలీసు సిబ్బంది, యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేత పనులను చేపట్టారు. భారీ పోలీసు భద్రత మధ్య కూల్చివేతలు కొనసాగాయి. కబ్జాకోరులు కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. తెల్లవారుజామేనే రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు.