18-03-2025 12:00:00 AM
పటాన్ చెరు, మార్చి 17 : ఖాజీపల్లి పరిధిలోని సర్వేనంబర్ 181 జర్నలిస్ట్ కాలనీలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. తహసీల్దార్ భిక్షపతి ఆదేశాల మేరకు ఆర్‌ఐ జయప్రకాశ్ నారాయణ ఇంటి నిర్మాణాన్ని జేసీబీతో కూల్చివేయించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణలు చేపడితే చట్ట రీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.