04-03-2025 01:21:40 AM
పటాన్చెరు, మార్చి 3 : జిన్నారం మండలం ఖాజీపల్లి పరిధిలోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రి అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. జీఎంఆర్ కాలనీ, జర్నలిస్టు కాలనీల సమీపంలో ప్రభుత్వ భూమిలో నిర్మంచిన గదులను తహసీల్దార్ భిక్షపతి ఆదేశాల మేరకు ఆర్‌ఐ జయప్రకాశ్ నారాయణ జేసీబీతో కూల్చివేశారు.
తరుచూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని ఆర్‌ఐ తెలిపారు. అలాగే గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్లపై ఆర్‌ఐ చర్యలు చేపట్టారు. నీటిని సరఫరా చేస్తున్న పలు ట్యాంకర్ల టైర్ల నుంచి గాలి తొలగించి ఫైన్లు విధించారు.