అమీన్పూర్ (విజయక్రాంతి): అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు చేసిన వాటిని గుర్తించి హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సోమవారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపూర్ కాలనీలో రోడ్డుకు అడ్డంగా నిర్మాణం చేసిన భవనాలను కుల్చివేస్తున్నారు. వందనపురి కాలనీలోని సర్వే నంబర్ 848 లో చేసిన నిర్మాణాలను హైడ్రాధికారులు భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా నిర్మాణాలు చేయడంతో హైడ్రాధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రాధికారులతో పాటు పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని కూల్చివేతలు ప్రారంభించారు.