calender_icon.png 19 April, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

11-04-2025 12:48:10 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 10 : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. *కబ్జాదారులకు అడ్డాగా అమీన్ పూర్ శీర్షికన విజయ క్రాంతి దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి సంగారెడ్డి జిల్లా అధికారులు స్పందించారు.

వారి ఆదేశాలతోఅమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 993 ప్రభుత్వ భూమిలో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను ఆర్‌ఐ శ్రీమాన్ రాజు సిబ్బందితో కలిసి జేసీబీలతో కూల్చివేయించారు. ప్రభుత్వ భూముల్లో తరుచూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని గుర్తించి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులుతెలిపారు.