calender_icon.png 22 September, 2024 | 1:10 PM

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

22-09-2024 10:43:46 AM

పటన్ చెరు : సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడా గ్రామాల పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్లు 12, 164 లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేసిన వాటిని అధికారులు  గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చివేతల ప్రారంభించారు.