25-03-2025 01:25:03 AM
చిన్నంబావి, మార్చి 24 ( విజయక్రాంతి):మండల కేంద్రంలోని పెద్దదగడ శివారులోని సర్వేనెంబర్ 195 లో ఉన్న 19 గుంటల ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను స్థానిక తాసిల్దార్ ఎండి. ఇక్బాల్,ఎంపీడీవో రమణారావు కూల్చి వేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమాలను అక్రమ కట్టడాలను కూల్చివేయశామని అన్నారు. నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన యజమానుల కుటుంబ సభ్యులను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం బాధితులు మాట్లాడుతూ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని, నిర్మాణాల రెగ్యులరైజేషన్ కొరకు గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో 59 ద్వారా కోర్టుకు ఆర్జీ పెట్టుకున్నమని కోర్టు నుంచి ఆ భూమిలో చేపట్టిన అక్రమనిర్మాలను అక్రమ నిర్మాణాలను కూల్చోదంటూ స్టే ఇచ్చిన కూల్చివేశారని బాధితులు బోరున విలపించారు.