calender_icon.png 6 March, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కట్టడాల కూల్చివేత

06-03-2025 12:00:00 AM

నేలమట్టం చేసిన బీజేఎంసీ అధికారులు అనుమతులు లేకుంటే కఠిన చర్యలు: కమిషనర్ శరత్ చంద్ర 

రాజేంద్రనగర్, మార్చి5 (విజయక్రాంతి: బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కమిషనర్ శరత్ చంద్ర ఆదేశాల మేరకు మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి బుధవారం పి అండ్ టీ కాలనీ, అదేవిధంగా రాధా నగర్ కాలనీలో అక్రమ కట్టదాలను నేలమట్టం చేశారు. పిఎన్టి కాలనీలో సెట్ బ్యాక్స్ లేకుండా, అడ్డగోలుగా నిర్మించిన కట్టడాన్ని కూల్చివేశారు.

అదేవిధంగా రాధానగర్ కాలనీలో రోడ్డు పై నిర్మించిన అక్రమ కట్టడాన్ని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శరత్చంద్ర మాట్లాడుతూ.. అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.