25-02-2025 07:55:26 PM
పటాన్ చెరు: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని శాంతినగర్, గ్రీన్ ఫీల్డ్, ఐడీఏ బొల్లారంలోని వైయస్సార్ కాలనీలో అనుమతికి మించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను అమీన్ పూర్ ఐడీఏ బొల్లారం మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మంగళవారం కూల్చి వేశారు. గతంలో ఈ నిర్మాణాలకు నోటీసులు జరిచేసిన ఇలాంటి దిద్దుబాటు చర్య లేకపోవడంతో వాటిని కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.