బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చిన్న బూద పరిధిలో గల ఇందిరా నగర్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను శుక్రవారం రెవెన్యూ సిబ్బంది జేసిబితో కూల్చివేశారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారనే ఫిర్యాదుల మేరకు నిర్మాణాలను కూల్చి వేస్తున్నట్లు ఆర్ఐ ఆదిలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని ఆమె హెచ్చరించారు.